end
=
Thursday, September 19, 2024
ఉద్యోగ సమాచారంసాయుధ బలగాల్లో లక్ష ఉద్యోగాలు
- Advertisment -

సాయుధ బలగాల్లో లక్ష ఉద్యోగాలు

- Advertisment -
- Advertisment -

కేంద్ర సాయుధ బలగాల్లో లక్ష పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బిఎస్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌ విభాగాలలో చాలా వరకు పదవీ విరమణ, మరణాలు, రాజీనామాల వల్ల ఖాళీలు ఏర్పడినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ రాజ్యసభలో వివరించారు. అయితే సిఆర్‌పిఎఫ్‌లో 26,506, బిఎస్‌ఎఫ్‌లో 28,926, సిఐఎస్‌ఎఫ్‌లో 23,906, ఎస్‌ఎస్‌బిలో 18,643, ఐటీబీపిలో 5,784, అస్సాం రైఫిల్స్‌లో 7,328 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన వివరించారు.

పోలీసుల ఎన్‌కౌంటర్‌ – మావోయిస్టు హతం

ఈ విభాగాలలో చాలా వరకు కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలావుండగా వీటిని నిర్ధారిత ప్రక్రియ ద్వారానే భర్తీ చేస్తామని మంత్రి నిత్యానంద్‌ స్పష్టం చేశారు. డిప్యూటేషన్‌, పదోన్నతులు, కొత్త నియామకాల ద్వారా అన్ని పోస్టులు భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా ప్రస్తుతం 60,210 కానిస్టేబుల్‌ పోస్టులు, 2,534 ఎస్‌ఐ పోస్టులు, 330 అసిస్టెంట్‌ కామండెంట్స్‌ ఖాళీలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ ప్రక్రియ జరుగుతుందని వివరించారు.

సిఎంఆర్‌ఎఫ్‌ నకిలీ చెక్కులతో విత్‌డ్రా యత్నం

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -