end
=
Friday, November 22, 2024
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంNew Home:గృహప్రవేశంలో పాలు ఎందుకు పొంగిస్తారు?
- Advertisment -

New Home:గృహప్రవేశంలో పాలు ఎందుకు పొంగిస్తారు?

- Advertisment -
- Advertisment -

పాలు పొంగిన ఇల్లు సిరులు పొంగే ఇల్లవుతుందని మనవారి నమ్మకం. పాలు పొంగిన ఇంట్లో ఐష్టెశ్వర్యాలు, భోగభాగ్యాలు(Pleasures) విలసిల్లుతాయి. కొత్త ఇంటిలోకి ముందుగా గోవును ప్రవేశపెట్టి, తరువాత యజమాని ప్రవేశిస్తాడు. గోవు మహాలక్ష్మీ తిరిగిన ఇంటిలో దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఇంటి ఆడపడుచులను పిలిచి గృహప్రవేశ సమయంలో ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. ఆ పాలతో పరమాన్నం(Bliss) వండి వాస్తు పురుషునికి నైవేద్యం పెడతారు. దీనితో ఆ ఇంట్లో సుఖశాంతులకు(Peace), సంపదలకు కొదవ ఉండదని నమ్మకం. అందుకే కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు.

15 రోజుల్లోగా ఆన్ లైన్లో నమోదు చేయాలి

ఇంటిలో గర్భవతులు ఉన్నపుడు గృహప్రవేశం చేయచ్చా?

శాస్త్రప్రకారం ఇంట్లో గర్భవతులైన స్త్రీలు ఉన్నప్పుడు ఇంటి శంకుస్థాపన(Foundation) చేయకూడదు. గర్భవతిగా ఉన్న ఇల్లాలికి సహాయం చేయవలసిన పురుషుడు ఇంటి నిర్మాణంలో పడితే ఆమెకు, పుట్టబోయే బిడ్డకు సరైన సేవ చేయలేడు. వారిద్దరికి అన్యాయం చేసినట్లౌతుంది. కాబట్టి ఇంటిలో గర్భవతులు(Pregnant ladies) ఉండగా గృహనిర్మాణ, గృహప్రవేశాదులు చేయకూడదు. అయితే ఇల్లు కట్టుబడి ప్రారంభించిన తరువాత ఇల్లాలు నెలతప్పితే గృహనిర్మాణం, గృహప్రవేశం నిరభ్యంతరంగా చేయవచ్చు.

భారీ చోరీ

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -