- మృతురాలి కుటుంబ సభ్యులకు చెక్ అందించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
మెదక్ : విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలయిన హావేలి ఘనపూర్ మండలం కూఛన్ పల్లి గ్రామానికి చెందిన తొగిట ఉమ (భర్త సత్యనారాయణ) కుటుంభానికి ఆర్థిక సహాయంగా మంజూరు అయిన రూ.5,00,000 చెక్ ను సీఎం కేసీఆర్ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అందించారు. తమ కుటుంభ సభ్యురాలు ను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న తమకు ఎక్స్ గ్రేషియా మంజూరు చేయించి తమను ఆపదలో ఆదుకున్నందుకు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి తమ కుటుంబం జీవితాంతం రుణ పడి ఉంటుందని మృతురాలు భర్త తొగిట సత్యనారాయణ తెలిపారు.
ఇవి కూడా చదవండి…