end
=
Friday, November 22, 2024
రాజకీయందుబ్బాక అభ్యర్థి ఎంపికలో టిఆర్‌ఎస్‌ తర్జనభర్జన
- Advertisment -

దుబ్బాక అభ్యర్థి ఎంపికలో టిఆర్‌ఎస్‌ తర్జనభర్జన

- Advertisment -
- Advertisment -

దుబ్బాక ఉపఎన్నికల బరిలో అధికార టీఆర్ఎస్ తరఫున కొత్తగా ఓ అధికారి పేరు తెరపైకి వస్తున్నది. అటు రామలింగారెడ్డి, ఇటు ముత్యంరెడ్డి కుటుంబాల వారు పార్టీ టిక్కెట్టు కోసం రచ్చ చేస్తుండటంతో మధ్యేమార్గంగా ఆ అధికారిని రంగంలోకి దించాలని గులాబీ బాస్ ఆలోచన చేస్తున్నారట. ఇంతకీ ఆ అధికారి ఎవరు? ఆయనను దుబ్బాక బరిలో నిలిపితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో తెలియాలంటే.. ఈ కథనం చూడాల్సిందే!

అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు

దుబ్బాక ఉపఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ అధికార టీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. ఉప ఎన్నికల షెడ్యూలు విడుదల అయ్యేంతవరకు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏదైనా స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మృతిచెందితే.. ఆ కుటుంబానికి ముందుగా టిక్కెట్ ప్రకటించి ప్రజలు, ఇతర మిత్రపక్షాల ఆమోదం తీసుకుని బరిలో దింపుతారు. సహజంగానే ఆ నియోజకవర్గ మొత్తంలో ఆ కుటుంబంపై సానుభూతి ఉంటుంది. కానీ ఇప్పుడు దుబ్బాక ఉపఎన్నికల్లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణానంతరం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ కుటుంబంపై కార్యకర్తల్లో, ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని సీఎం కేసీఆర్‌కు సమాచారం అందుతున్నట్లు తెలుస్తోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులకు కరోనా

ఆయనకిస్తే పార్టీ శ్రేణులు అంగీకరించరనే…

ఈ ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం, ఆ గ్రామాల్లో గ్రూపులను ప్రోత్సహిస్తూ స్వయంగా ఎమ్మెల్యేనే వ్యవహరించడం కార్యకర్తలు, ప్రజల్లో చీలిక తెచ్చిందట. ప్రస్తుతం ఆ వర్గాలన్నీ ఒక్కటై పునరాలోచనలో పడటంతో సోలిపేట రామలింగారెడ్డి మరణించినా కూడా సానుభూతి పొందలేకపోయారు. ఇటీవల ఆయన కుమారుడు సతీశ్ రెడ్డి వ్యవహారశైలిపై సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం కావడంతో.. పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడిందట. మరోవైపు టీఆర్ఎస్‌లో చేరిన చెరుకు ముత్యంరెడ్డి కుటుంబానికి కూడా దుబ్బాకలో మంచిపేరు ఉంది. అయితే సోలిపేట కుటుంబానికి కాకుండా చెరుకు ముత్యంరెడ్డి కుటుంబానికి టీఆర్ఎస్ టిక్కెట్ ఇస్తే.. పార్టీ శ్రేణులు అంగీకరించరనే వాదన ఉందట. దీంతో గులాబీ బాస్ కేసీఆర్ మధ్యేమార్గంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరు ప్రతిపాదించారనే చర్చ జరుగుతోంది.

తనకు విద్యాబుద్దులు నేర్పిన దుబ్బాకలో బలమైన, విద్యావంతుడైన వ్యక్తిని బరిలో దింపాలనేది కేసీఆర్ యోచనగా తెలుస్తోంది. పైగా తన ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను అమలు చేస్తారని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ఇప్పటికే కేసీఆర్ ప్రశంసించారు కూడా. ఈ నేపథ్యంలో ఆయన పేరు ఖరారు చేయడం వల్ల.. అభివృద్ధికి దోహద పడే వ్యక్తిని అందించి భరోసా ఇచ్చినట్లు అవుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సైతం రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్నారు.

గతంలో హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీకి టీఆర్ఎస్ టిక్కెట్‌ను ఆయన ఆశించారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఒకానొక దశలో మల్కాజిగిరి ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున వెంకట్రామిరెడ్డికి టిక్కెట్ దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. చివరి క్షణంలో అది కూడా చేజారడంతో ఆయన కొంత నిరాశకు లోనయ్యారు. తర్వాత కలెక్టర్‌గా తనపని తాను చేసుకుపోతున్నారు. తాజాగా దుబ్బాక ఉపఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి పేరు మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యే కేసీఆర్ అయినా.. అధికారమంతా ఆయనదే…

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై సదాభిప్రాయం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటుంటాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో విధి లేని పరిస్థితుల్లో వెంకట్రామిరెడ్డిని ఇక్కడి నుంచి సిరిసిల్ల కలెక్టర్‌గా బదిలీ చేసినా.. ఎన్నికలు అయిపోగానే ఆయన్ను మళ్లీ సిద్దిపేటకు రప్పించారు. ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాలు పేరుకు ముఖ్యమంత్రి దత్తత గ్రామాలైనా.. వాటి అభివృద్ది బాధ్యతలు పూర్తిగా వెంకట్రామిరెడ్డి చూసుకున్నారు. అందుకే చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్ గ్రామాల బాధ్యతలను కూడా వెంకట్రామిరెడ్డికే కేసీఆర్ అప్పగించారట. గతంలో చింతమడక సభా వేదికపైనే సీఎం కేసీఆర్ పదేపదే జిల్లా కలెక్టర్‌ను పొగిడారు.

ఉద్యోగం కోల్పోయిన వారికి ESI తీపి కబురు

అలాగే గజ్వేల్‌ సభా వేదికగా కూడా ఆయన్ను ప్రశంసించారు. అధికారికంగా గజ్వేల్ ఎమ్మెల్యే తానే అయినప్పటికీ, అనధికారికంగా గజ్వేల్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డే అని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇప్పుడు దుబ్బాక ఉపఎన్నికల బరిలో వెంకట్రామిరెడ్డి పేరు తెరపైకి రావడం అనూహ్య పరిణామం అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికితోడు మంత్రి హరీశ్ రావు సైతం ఇటీవల చెల్లాపూర్ సభలో టీఆర్ఎస్ టిక్కెట్‌ ఎవరికిచ్చినా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలువునిచ్చారు. ఇదికూడా దుబ్బాకలో జరగనున్న మార్పులకు సంకేతాలని పరిశీలకులు భావిస్తున్నారు.

కలెక్టర్ పై ఇష్టం లేని మంత్రి హరీశ్ రావు..?

అయితే రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీశ్ రావు,ఆయన అనుచరులకు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేనట్లు విశ్వసనీయ సమాచారం. అయితే సీఎం కేసీఆర్ నిర్ణయానికి పార్టీ శ్రేణులు కట్టుబడి ఉంటారా.. లేదా అనేవి అంతుచిక్కని ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వేధిస్తున్న ప్రశ్న.
ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గంలోని వివిధ మండలాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎంపీపీలు, జెడ్పీటీ సీలను ఇంచార్జీలుగా నియమించి ప్రచారం చేస్తున్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేయకపోవడం వెనుక సీఎం కేసీఆర్ హ్యూహం ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రచారంలో రఘునందన్ రావు..

ఇక ప్రచారంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందు వరుసలో ఉన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -