- రెండు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
- కోవిడ్ రికవరీ రేటు 85.93 శాతం
కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య తెలంగాణ రాష్ర్టంలో రోజు రోజుకుపెరిగిపోతుంది. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా 1335 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,00,611కు చేరింది. ఇక ఆదివారం రోజున 8 మంది కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య తెలంగాణ రాష్ర్టంలో 1171కు చేరింది. 24 గంటల్లో రాష్ర్టంలో 2176 మంది కరోనా రోగులు కోలుకొని ఇంటికి వెళ్లారు.
జెఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షా ఫలితాలు…
ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1,72,388 గా ఉంది. ఇక యాక్టివ్ కేసులు 27,052గా ఉన్నట్లు రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇదిలావుండగా తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు 85.93 శాతానికి పెరిగింది. దేశంలో మరణాల రేటు 1.5 శాతంగా ఉండగా తెలంగాణలో 0.58 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 36,348 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని, దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 32,41,597 కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.