- ఏపీలో హిందూ దేవాలయాలపై ఆగని దుండగుల దుశ్చర్యలు
యాలకులతో శృంగార సమస్యలకు చెక్
ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. రథాలు ధ్వంసం చేయడం, కాలబెట్టడం, విగ్రహాలను కూల్చడం వంటివి హిందూ మతవాదులను, మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అయితే తాజాగా కర్నూలోని నరసింహస్వామి విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. మంత్రాలయం మండలం వగరూరు చెరువు కర కట్ట నరసప్పతాత (లక్ష్మీనరసింహ్మస్వామి) విగ్రహంపై దాడి చేసి స్వామివారి తలపై ఉన్న శేషపడగలను విరగొట్టారు.
బదిలీపేరుతో రియల్ వ్యాపారి నమ్మక ద్రోహం
ఆలయ పూజారి ఉదయం దేవాలయానికి వచ్చి చూసే సరికి 9 శేషపడగల్లో 4 శేషపడగల తలలు విరిగిపడిఉన్నాయి. దీంతో పూజారి భయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానికులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది కేవలం మత విశ్వాసాలను దెబ్బతీయడం, ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి గందరగోళం సృష్టించడానికే కొందరు దుండగులు పనికట్టుకొని రాత్రి సమయాల్లో ఇలాంటి విధ్వంస పనులు చేస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.