end
=
Wednesday, February 5, 2025
వార్తలురాష్ట్రీయంకారు రివర్స్‌ గేర్‌ - మహిళ మృతి
- Advertisment -

కారు రివర్స్‌ గేర్‌ – మహిళ మృతి

- Advertisment -
- Advertisment -

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

కారు డోర్‌ – చెట్టు మధ్య ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన బెంగుళూరులోని సదాశివనగర్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో టెక్కి అయిన నందిని రావ్‌(45) అనే మహిళ మృతి చెందింది. రివర్స్‌ గేర్‌లో చెట్టు కింద నిలిపిన కారు వెనక్కి రావటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చెట్టు, కారు డోర్‌ మధ్య ఇరుక్కుని మహిళ మరణించింది. నందిని రావు(45) కొడుకును ఆడిస్తూ బయటకు వచ్చింది. ఆ సమయంలో రోడ్డు పక్కన పార్కింగ్‌ చేసి ఉన్న కారు డోర్ తీసింది.

పాలిసెట్‌ అర్హత మార్కులు 25 శాతానికి తగ్గింపు

రివర్స్‌ గేర్‌లో నిలిపిన విషయం మరిచి పోయి అందులో ఎక్కబోయింది. దాంతో అనుకోకుండా కారు వెనక్కి కదిలింది. అయితే ఆ సమీపంలోనే చెట్టు ఉంది. దీంతో కారు తలుపుకు చెట్టుకి మధ్య నందిని రావు ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సహాయం కోసం కేకలు వేసింది. స్థానికులు వచ్చి ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మరణించింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు ఆ ఏరియా ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

అక్రమంగా ఇసుక రవాణా – ట్రాక్టర్లు సీజ్‌

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -