end
=
Sunday, January 19, 2025
బిజినెస్‌వినియోగదారులకు పేటిఎం షాక్‌
- Advertisment -

వినియోగదారులకు పేటిఎం షాక్‌

- Advertisment -
- Advertisment -
  • క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై 2% నామినల్‌ చార్జీలు
  • బ్యాంకులు, పేమెంట్‌ గేట్‌వేలు చార్జీలు పెంచడం వల్లే ఈ నిర్ణయం
  • డెబిట్‌కార్డు, యూపిఐ లావాదేవీలు ఎటువంటి చార్జీలు లేవు

వైధవ్య కోడలిని పెళ్లాడిన మామ…!

ప్రముఖ ఈ-వాలెట్‌ సంస్థ పేటిఎం వినియోగదారులపై ఇక నుండి 2% చార్జీల మోత విధించబోతుంది. పేటిఎం వాలెట్‌లోకి క్రెడిట్‌ కార్డు ద్వారా డబ్బులు లోడ్‌ చేసుకోవాలంటే ఇకపై 2% కమీషన్‌ చార్జీలు వేయనుంది. ఇదివరకు ఇది 10 వేలకు పైగా డబ్బులు లోడ్‌ చేస్తేనే 2% కమిషన్‌ చార్జీలు వేసేవారు. కానీ ఇక నుండి ఎంత డబ్బు వాలెట్‌కు జత చేసినా కూడా అన్నింటికి ఈ నామినల్‌ చార్జీలు వర్తిస్తాయని పేటిఎం సంస్థ ప్రకటించింది.

బస్సులో మంటలు … తప్పిన ప్రమాదం

అయితే పేటిఎం వాలెట్‌కు డెబిట్‌ కార్డు లేదా యూపిఐ ద్వారా డబ్బులు జమ చేస్తే ఎటువంటి చార్జీలు ఉండవని సంస్థ స్పష్టం చేసింది. క్రెడిట్‌ కార్డు ద్వారా వాలెట్‌కు డబ్బులు జమ చేయడం వల్ల బ్యాంకు లేదా పేమెంట్‌ గేట్‌వే నెట్‌వర్కులు అధిక చార్జీలు వేస్తుంన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. కనుక పెటియం వినియోగదారులు జాగ్రత్త. ఇక నుండి క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.10 జమ చేసిన కూడా 2% యూజర్‌/నామినల్‌ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

కార్పొరేటర్‌పై స్థానికుల దాడి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -