మూడు రోజులపాటు మళ్లీ భారీ వర్షాలు !
కాసేపట్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ విజయం ఇరు జట్లకు కీలకం కాగా, సన్‌రైజర్స్‌కు మరీ ముఖ్యమైంది. ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ ఆడిన 8 మ్యాచుల్లో 3 మ్యాచుల్లో విజయం సాధించి, 5 మ్యాచుల్లో ఓడింది. ఓపెనర్లు వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో మంచి ఆరంభాలిస్తున్నా.. భారీ స్కోర్లు చేస్తున్నప్పటికీ మిగితా వారి నుంచి వారికి సపోర్ట్ దొరకడం లేదు. మానిష్ పాండే పర్వాలేదనిపిస్తున్నాడు. బౌలింగ్‌లో భువనేశ్వర్ దూరమవడం హైదరాబాద్ జట్టుకు లోటనే చెప్పాలి.
మరోవైపు, కేకేఆర్ ఆడిన 8 మ్యా చుల్లో 4 నెగ్గి, 4 మ్యాచుల్లో ఓటమి పాలైంది. మొదటి 7 మ్యాచ్‌లకు దినేష్ కార్తీక్ కెప్టెన్సీ వహించగా.. ప్రస్తుతం ఆ జట్టుకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. డీకే తనపై ఒత్తిడి తగ్గించుకొని, బ్యాటింగ్‌లో రాణించాలనే తనకు తానుగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కేకేఆర్ బ్యా టింగ్ విషయానికొస్తే.. రస్సెల్‌పై ఆ జట్టు భారీగానే ఆశలు పెట్టుకుంది. తన సూపర్ నాక్ కోసం అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు.