- ములుగు, రామచంద్రునిపేట అటవీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర కూంబింగ్
మానేరు డ్యాంలో పడి రెండేళ్ల బాలుడు మృతి
ఏజెన్సీ ప్రాంతం రామచంద్రునిపేట అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. అయితే గత కొంత కాలం నుండి పోలీసులకు, మావోయిస్టుల మధ్య తరుచూ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంత వాసులు బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. అలాగే ములుగు జిల్లా మంగపేట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య బీకర కాల్పుల యుద్ధం జరుగగా ఇద్దరు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు పోలీసులు వెల్లడించారు.
కరోనా రోగులకు ప్లాస్మా థెరఫీ ఎంతో కీలకం
అలాగే రామచంద్రునిపేట అడవుల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో కూడా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన మావోయిస్టులు ఇటీవల టీఆర్‌ఎస్ నేత భీమేశ్వరావును హతమార్చినవారుగా గుర్తించారు. కాగా, ఈ నెల 10న అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురంలో టీఆర్ఎస్ నేత భీమేశ్వర రావుని అర్ధ రాత్రి బయటకు లాక్కొచ్చి చంపిన విషయం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
మూడు రోజులపాటు మళ్లీ భారీ వర్షాలు !
ఇన్‌ఫార్మరనే నెపంతో మావోయిస్టులు ఈ ఘూతుకానికి పాల్పడ్డారు. ఈ కేసును ప్రేస్టేజియస్ గా తీసుకున్న పోలీసులు గస్తీ పెంచారు. ప్రతి రోజు కూంబింగ్ నిర్వహిస్తూ అనుమానితులను అరా తీస్తున్నారు. ఇదిలావుండగా ముసలమ్మగుట్ట అటవీప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. మావోయిస్టులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా కూంబింగ్ నిర్వహిస్తూనే ఉంటారని ములుగు ఎస్పీ తెలిపారు.