నవంబర్ 2 నుంచి స్కూళ్లు రీ-ఓపెన్
భారీ వర్షాలతో అతలాకుతమైన భాగ్యనగరాన్ని ఆదుకోవడానికి సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. సామాన్య ప్రజలు ఆపదలో ఉంటే వెంటనే స్పందించే తెలుగు చిత్రసీమ.. తమ వంతు సాయాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్‌ఫండ్‌కు అందించడానికి ముందుకొచ్చింది. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు.. జలదిగ్బంధంలో చిక్కుకున్న మన సిటీ ప్రజలను రక్షించుకోవడానికి తన వంతు సాయంగా కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందిస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
వరద బాధితులకు ఏ హీరో ఎంత సాయం చేశారో ఓ లుక్కేద్దాం..
ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలిః ప్రధాని
- చిరంజీవి- 1కోటి
- మహేష్ బాబు- 1కోటి
- జూనియర్ ఎన్టీఆర్- 50 లక్షలు
- నాగార్జున- 50 లక్షలు
- రామ్- 25 లక్షలు
- విజయ్ దేవరకొండ- 10 లక్షలు
- త్రివిక్రమ్, హారిక హాసిని బ్యానర్ సంయుక్తంగా 20 లక్షలు
- అనిల్ రావిపూడి- 5లక్షలు
- బండ్ల గణేష్- 5లక్షలు
నగదు సాయమే కాకుండా కొందరు తారలు స్వయంగా ముంపు ప్రాంతాలకు వెళ్లి ఆహారం, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు తక్షణ సాయం చేయడానికి మరింత మంది సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ముందుకొస్తాన్నారు.