సీఎం రిలీఫ్ ఫండ్‌కు సినీ ప్రముఖుల భారీ విరాళం..
మహమ్మారి వ్యాధి కరోనా(కోవిడ్ 19) పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జాతినుద్ధేశించి ప్రసంగించిన ప్రధాని.. పలు కీలక విషయాలను వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుందని ఆయన అన్నారు.
నవంబర్ 2 నుంచి స్కూళ్లు రీ-ఓపెన్
అమెరికా, బ్రెజిల్, యూకే లాంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా కేసుల నమోదు, మరణాల రేటు చాలా తక్కువుందన్నారు. ప్రతి 10 లక్షల మందిలో ఐదున్నర వేల మందికి కరోనా వస్తోందనీ.. లాక్‌డౌన్ ఎత్తేసినంత మాత్రాన ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ప్రధాని పేర్కొన్నారు.
ముంపు బాధితులకు రూ.10వేల తక్షణ సహాయం
ప్రతి ఒక్కరూ వైద్యుల సలహాలు పాటిస్తూ.. పలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారిని దేశం నుంచి త్వరగా తరిమేయొచ్చని ప్రధాని మోది ప్రజలకు సూచించారు. పండుగల పూట, జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అప్రమత్తంగా ఉండాలని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు.