end
=
Saturday, November 23, 2024
సినీమాసినిమాల్లోకి రాకుంటే పోలీసయ్యేవాడిని..
- Advertisment -

సినిమాల్లోకి రాకుంటే పోలీసయ్యేవాడిని..

- Advertisment -
- Advertisment -

కింగ్స్‌ విక్టరీ‌.. ధావన్‌ సెంచరీ వృధా

తాను సినిమా రంగంలోకి రాకుంటే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్లేవాడినని ప్రముఖ సినీ నటుడు సాయికుమార్‌ తెలిపారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం తిరుమల వెళ్లిన సాయికుమార్.. సతీసమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వారు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు సాయికుమార్‌ దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారికి రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

గబ్బర్‌ మరో సెంచరీ.. పంజాబ్‌ లక్ష్యం165

స్వామివారి దర్శనానంతరం సాయికుమార్‌ను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ప్రభావంతో ఆగిపోయిన షూటింగ్‌లు మళ్లీ ప్రారంభమవడం సంతోషంగా ఉంది. తిరుపతి పరిసరాల్లో ‘శ్రీకారం’అనే సినిమా షూటింగ్‌ జరుగుతున్నందున స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చామని తెలిపారు. కాగా, ఈ సినిమాలో శర్వానంద్‌ హీరోగా నటిస్తున్నారని ఆయన వెల్లడించారు. తాను నటించిన ‘పోలీస్‌ స్టోరీ’ విడుదలై 24 సంవత్సరాలు పూర్తవుతుందని ఆయన అలనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా ఇంతటి భారీ హిట్‌ అవుతుందని తాను ఊహించలేదనీ.. కానీ, ఆ సినిమా నన్ను హీరోగా, నటుడిగా మరో ఎత్తుకు తీసుకెళ్లిందని సాయి భావోద్వేగానికి గురయ్యారు.

ఒకవేళ తాను సినిమాల్లోకి రాకుంటే పోలీసు రంగంలోకి వెళ్లేవాడినని సాయికుమార్‌ తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులే నిజమైన హీరోలని ఆయన అన్నారు. కాగా, సాయి డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా విశేషంగా రాణించాడు. రాణిస్తూనే ఉన్నాడు కూడా.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -