సాధారణంగా టీ 20ల్లో సెంచరీ చేయడమే గొప్ప. అలాంటిది గబ్బర్(శిఖర్ ధావన్) బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేశాడు. గత మ్యాచ్‌లో సెంచరీతో తన జట్టును గెలిపించిన శిఖర్.. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుతో తలపడిన మ్యాచ్‌లోనూ అదే ఫామ్‌ను కనబరిచాడు. 61 బంతులాడిన శిఖర్.. 12ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డీసీ.. అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. ధావన్ మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ రాణించలేదు. జట్టు మొత్తం 164 పరుగులు చేస్తే.. అందులో ధావన్ స్కోరే 106 ఉండడం గమనర్హం. ఎన్నో ఆశలు పెట్టుకున్న అయ్యర్, పంత్, స్టోయినిస్ రాణించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమీ 2 వికెట్లు తీయగా.. మ్యాక్స్‌వెల్, నీషమ్, మురుగన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.