end
=
Sunday, January 19, 2025
క్రీడలుకోహ్లి సేన రాయల్‌ విక్టరీ..
- Advertisment -

కోహ్లి సేన రాయల్‌ విక్టరీ..

- Advertisment -
- Advertisment -

-సిరాజ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

85 పరుగుల స్వల్వ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లిసేన.. ఎలాంటి తడబాటు లేకుండా కోల్‌కతాను చితక్కొట్టింది. 13.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి, లాంఛనాన్ని ముగించింది. ఓపెనర్‌ దేవదూత్‌ పడిక్కల్‌(17 బంతుల్లో 25 పరుగులు; 3ఫోర్లు), ఆరోన్‌ ఫించ్‌(21 బంతుల్లో 16పరుగులు; 2 ఫోర్లు) తొలివికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 46 పరుగుల వద్దే రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. కోల్‌కతా బౌలర్లకు ఎలాంటి ఛాన్స్‌ ఇవ్వలేదు. గుర్‌కీరత్‌ సింగ్‌ మన్‌(26 బంతుల్లో 21 పరుగులు; 4 ఫోర్లు), కెప్టెన్‌ విరాట్‌(17 బంతుల్లో 18 పరుగులు; 2 ఫోర్లు) బెంగళూరు విజయాన్ని ఖాయం చేశారు.

కోల్‌కతా బౌలర్లలో ఫెర్గూసన్‌ ఒక వికెట్‌ తీసుకోగా.. పడిక్కల్‌ను కమ్మిన్స్‌ రనౌట్‌ చేశాడు. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుకు ఎంపికయ్యాడు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి, కేవలం 84 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఒక్కడే 30 పరుగులు చేశాడు. మిగితా బ్యాట్స్‌మెన్‌ అంతా ఆర్సీబీ బౌలర్ల ధాటికి మూకుమ్మడిగా విఫలమయ్యారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -