end
=
Wednesday, November 20, 2024
బిజినెస్‌కాగ్నిజెంట్ ఇండియాకు కొత్త సీఎండీ..?
- Advertisment -

కాగ్నిజెంట్ ఇండియాకు కొత్త సీఎండీ..?

- Advertisment -
- Advertisment -

కాగ్నిజెంట్ ఇండియా సంస్థకు కొత్త సీఎండీ వచ్చారా అంటే అవుననే సమాధానం వస్తోంది. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా రాజేషన్‌ నంబియార్‌ నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా కూడా ఆయన‌ నియమించబడుతున్నట్లు తాజా సమాచారం. నవంబరు 9 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఆయన నెట్ వర్కింగ్, సిస్టమ్స్ అండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సియేనా ఇండియా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌లో కంపెనీ కార్యకలాపాలను, ప్రభుత్వం మరియు వినియోగదారులతో సంబంధాలను మరింత బలోపేతం చేసే క్రమంలోనే రాజేష్ ఎంపిక జరిగిందని బిజినెస్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. సంస్థ సీఈవో బ్రియాన్ హాంప్‌షైర్స్ ఈ విషయాన్ని స్వతహాగా ధృవీకరించారు.

ఇదివరకు కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్న రామ్‌కుమార్ రామమూర్తి తన పదవులకు కొద్ది నెలల క్రితం రాజీనామా చేశారు. కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హాంప్‌షైర్స్ ఈ విషయాన్ని ఉద్యోగులకు జూలై 10న వెల్లడించారు. కాగ్నిజెంట్ సంస్థలో రామ్ కుమార్ సుమారు 23 ఏళ్లపాటు పనిచేశారు. సంస్థ ఉన్నతికి ఆయన శాయశక్తులా కృషి చేశారని ఉద్యోగులకు రాసిన లేఖలో సీఈవో బ్రియాన్ పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -