వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు మరింత అందంగా తయారవుతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడిప్పుడే కొత్త లుక్స్‌లో కనిపించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడూ యంగ్ లుక్‌లోనే కనిపించే ఈ సూపర్‌స్టార్ తాజాగా ఓ కమర్షియల్ యాడ్‌లో మీసకట్టుతో కనిపించాడు.
కాగా మహేష్ న్యూ లుక్‌పై ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేశారు. కృత్రిమంగా అమర్చేవి ఎప్పుడూ వాస్తవికంగా కనిపించవు. వాటితో షూటింగ్ చేయాల్సి వచ్చినపుడు ఖచ్చితంగా సౌకర్యవంతంగా ఉండదు. అయితే తమ దగ్గర నిపుణులు ఉన్నప్పుడు సవాళ్లను ఎవరు ఇష్టపడరు అని అన్నారు. అలాగే మహేష్ మేకప్ వేసుకుంటున్న ఫొటోను ఆమె అభిమానులతో పంచుకున్నారు.