end
=
Thursday, November 21, 2024
వార్తలురాష్ట్రీయంఇద్దరూ.. ఇద్దరే: ఉత్తమ్‌కుమార్‌
- Advertisment -

ఇద్దరూ.. ఇద్దరే: ఉత్తమ్‌కుమార్‌

- Advertisment -
- Advertisment -

స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి హరీశ్‌రావు, దుబ్బాక ఉప ఎన్నిక బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఇద్దరూ.. ఇద్దరేననీ, తోడుదొంగలని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. వారిద్దరూ బంధువులేనని, ఓటర్లను ఆగం చేసేందుకు డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. బుధవారం దుబ్బాక మండలంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో కలసి పలుచోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఉన్న ప్రజాదరణ చూసి ఓటర్లను తికమక పెట్టేందుకు వారిద్దరూ కలసి అద్భుతమైన స్క్రిప్టు తయారు చేశారని విమర్శించారు. ప్రజలెవరూ గందర గోళం పడాల్సిన అవసరం లేదన్నారు.

బిగ్‌బాస్ కంటెస్టెంట్ నిశ్చితార్థం..!

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై అత్యాచారం కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తికి ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఆయన విపరీతంగా డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. దుబ్బాక, సిద్దిపేట తనకు రెండు కళ్లు అని హరీశ్‌రావు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇంత వరకు అమలు చేయలేదని విమర్శించారు. రుణమాఫీ, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు రావాలంటే టీఆర్‌ఎస్‌ను ఓడించాలని, అప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కిందికి దిగి వస్తారని ఉత్తమ్‌ ఈ సందర్భంగా అన్నారు.

నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..?

సీఎం కేసీఆర్‌ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఉత్తమ్‌ విమర్శించారు. నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తానని, ఇప్పటికీ ఇవ్వడం లేదనీ.. కానీ తన కుటుంబంలో కుమారుడు, అల్లుడికి మాత్రం మంత్రి పదవులు కట్ట్టబెట్టారని ఆరోపించారు. నిరుద్యోగులకు మాత్రం మొండిచెయ్యి చూపారని దుయ్యబట్టారు. తమ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విన్నవించారు.

ధరణి పోర్టల్ షురూ..

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -