end
=
Thursday, November 21, 2024
వార్తలురాష్ట్రీయంఏడాదిలోపే అందుబాటులోకి న్యూ సెక్రెటరియట్‌
- Advertisment -

ఏడాదిలోపే అందుబాటులోకి న్యూ సెక్రెటరియట్‌

- Advertisment -
- Advertisment -

తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నూతన సచివాలయం ఏడాదిలోగా అందుబాటులోకిరానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టనున్న ఈ భవనం నిర్మాణ పనుల తొలి అంకం గురువారం పూర్తయింది. సుమారు 25 ఎకరాల నికర విస్తీర్ణంలో నూతన సచివాలయ సముదాయం ఏర్పాటు కాబోతోంది. 2 వేల మంది అధికారులు, సిబ్బంది, వెయ్యి మంది సందర్శకులకు అనువుగా ఉండేలా సచివాలయం నిర్మాణంకానుంది. సచివాలయ నిర్మాణ కాంట్రాక్టును షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుందని ఆర్‌ అండ్‌ బీ శాఖ ప్రకటించింది.

రూ.494.86 కోట్ల అంచనాతో ఈ-బిడ్డింగ్‌ ద్వారా టెండర్‌ పిలువగా ఈ సంస్థ 4.02 శాతం ఎక్కువ కోట్‌ చేసిందని ఆర్‌ అండ్‌ బీ ఈఎన్‌సీ ఐ.గణపతిరెడ్డి తెలిపారు. ఎల్‌2గా నిలిచిన ఎల్‌ అండ్‌ టీ సంస్థ 4.8 శాతం ఎక్కువ కోట్‌ చేసిందని పేర్కొన్నారు. దీంతో షాపూర్‌జీ పల్లోంజీ సంస్థకే కాంట్రాక్టును కమిషనరేట్‌ ఆఫ్‌ టెండర్స్‌ (సీఓటీ) ఖరారు చేసిందని తెలిపారు. నూతన సచివాలయ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.617 కోట్లు మంజూరు చేస్తూ గత నెల 10న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇందుకు అనుగుణంగా ఆర్‌ అండ్‌ బీ శాఖ ఈ-బిడ్డింగ్‌ ద్వారా టెండర్లు పిలిచింది. కాగా, సచివాలయ భవన సముదాయంలో తొలుత 22 లిఫ్టులు ప్రతిపాదించగా ఆ తర్వాత మరోటి పెంచారు. తాజాగా మరికొన్ని లిఫ్టులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌ అండ్‌ బీ వర్గాలు తెలిపాయి. సిబ్బంది కోసం 7 భవనాలు ప్రతిపాదించగా.. వీటిని కూడా పెంచే అవకాశం ఉందని ఆర్‌ అండ్ బీ తెలిపింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -