స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 3850
పోస్టుల వివరాలు:సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు
పే స్కేల్: రూ. 23,700 + ఇంక్రిమెంట్లు
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత
అనుభవం: ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్‌లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు: 30 సంవత్సరాలు మించరాదు
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్/ఈడబ్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు: రూ. 750
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్యూడీ అభ్యర్ధులు: మినహాయింపు
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 16, 2020.