- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్స్ వర్కర్లకు ఉచితంగా రేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వం పేదలకు, నిరుపేదలకు అందిస్తున్న రేషన్ సరుకులను ఇక నుండి సెక్స్ వర్కర్లకు కూడా వర్తింపజేయాలనే సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారిలో సెక్స్ వర్కర్లు కూడా ఉన్నారని, తినడానికి తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్న గడ్డు పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
దుబ్బాక ఉప ఎన్నిక.. గెలుపు ధీమాలో ప్రధాన పార్టీలు
చౌకధరల దుకాణాలు, అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్రంలో 1.22 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టు ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇప్పటికే గుర్తించింది. వీరిలో హోమో సెక్సువల్స్‌తోపాటు ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం ఎంత రేషన్ ఇస్తోందో అంతే మొత్తంలో వీరికి కూడా పంపిణీ చేయనుంది.
మహిళ వేధింపు కేసులో నటుడి అరెస్ట్..
అయితే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్, లీగల్ ఆర్గనైజేషన్లు గుర్తించిన సెక్స్ వర్కర్లకు రేషన్ పంపిణీ చేయనుంది. లబ్ధిపొందిన వారి వివరాలను అత్యున్నత న్యాయస్థానంకు అందించనుంది. దీంతో ప్రభుత్వం ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన గుర్తింపు కార్డుల ఆధారంగా నవంబర్ నెల రేషన్ అందజేయనుంది.