end
=
Thursday, November 21, 2024
బిజినెస్‌రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు: మంత్రి కేటీఆర్‌
- Advertisment -

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు: మంత్రి కేటీఆర్‌

- Advertisment -
- Advertisment -

రాష్ట్ర ప్రభుత్వంతో ఓ వ్యాపార దిగ్గజ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నదని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. వివరాలు చూస్తే.. తెలంగాణాలో రూ. 20,761 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది. రాష్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద పెట్టుబడని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పలు చర్చల తర్వాత ఏవీఎస్ తమ పెట్టుబడులకు ముందుకు వచ్చిందని ఆయన అన్నారు. 2022 మధ్య ద్వితీయార్థంలో అమేజాన్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనుంది. ప్రతి అవైలబిలిటీ జోన్‌లో అనేక డాటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వ పారదర్శక, వేగవంతమైన పరిపాలనా విధానాల వల్లే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ను తన దావోస్ పర్యటనలో కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -