end
=
Friday, November 22, 2024
వ్యవసాయంపాడి రైతులకు ప్రోత్సాహం..
- Advertisment -

పాడి రైతులకు ప్రోత్సాహం..

- Advertisment -
- Advertisment -

పాడి రైతులను మరింత ప్రోత్సహించేందుకు గాను రుణాలు మంజూరు చేస్తున్నామని డీసీసీబీ చైర్మెన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయం నక్కలగుట్టలో బ్యాంకు అధ్యక్షులు మార్నేని రవీందర్ రావు అధ్యక్షతన డిస్టిక్ లెవెల్ మానిటరింగ్ రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. అనంతరం డీసీసీబీ చైర్మెన్ మాట్లాడుతూ.. రిజిస్టర్ డైరీ వారి అనుసంధానంలో జే ఎల్ జి సభ్యులకు వ్యవసాయ అనుబంధమైన పాడి గేదెలు లేదా ఆవుల కొనుగోలుకై రుణాలు మంజూరు చేయుటకు నియమ నిబంధనలపై వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పాలకవర్గం ఆమోదం తెలిపిందన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కె వెంకటేశ్వర రెడ్డి, బ్యాంక్ డైరెక్టర్స్ గున్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, కక్కిరాల హరిప్రసాద్, కెసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, ఏ జగన్ మోహన్ రావు, మాడుగుల రమేష్, సపవత్ కిషన్ నాయక్, నాయిని రంజిత్, చపాల యాదగిరి, చెట్టుపల్లి మురళీధర్, సంపెల్లి నర్సింగ రావు, పోలేపాక శ్రీనివాస్, ఎలుగం రవిరాజు, కొండ నరేందర్, అర్బన్ డీసీవో నీరజ , నాబార్డ్ డీడీఎం కృష్ణమూర్తి, టీఎస్ క్యాబ్ నోడల్ ఆఫీసర్ లత జాధవ్, సీఈఓ చిన్నా రావు, డిజిఎం అశోక్ , ఉష శ్రీ, ఎజిఎం మధు, స్రవంతి, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -