end
=
Friday, September 20, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంMother Milk:అమృత ధార ఆగితే..?
- Advertisment -

Mother Milk:అమృత ధార ఆగితే..?

- Advertisment -
- Advertisment -

Mother Milk:అన్నీ ఒకటే.. ప్రకృతి ప్రసాదించిన అమృతం.. అమ్మపాలు బిడ్డకు అందకపోవడం..! కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లే పెద్ద సమస్యలుగా పరిణమిస్తాయి. బిడ్డ పుట్టిన తరువాత తల్లికి పాలు రాకపోవడమంటూ ఉండదు. తెలిసో, తెలియకో మనం చేసే పనులు కొంత.. బిడ్డ ఆరోగ్యం బాగా లేకపోవడమో, ఇతర ఆరోగ్య సమస్యలో మరికొంత.. ఆ అమృత ధారలు రాకుండా అడ్డుకుంటాయి. పసిబిడ్డలకు పోషకాహారం దూరం కాకుండా ఉండాలంటే అమ్మపాలు ఎలా వస్తాయో, రాకపోవడానికి కారణమేమిటో పాలిచ్చే తల్లులు తెలుసుకోవాలి.  

‘ఆమెకు పాలు రాలేదు… అందుకే పిల్లకి డబ్బా పాలే ఇస్తున్నారు’ అనే మాట  అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం.  పాలు రాలేదంటే .. ఆ తల్లికి పాలు ఎలా ఇవ్వాలో తెలియడం లేదనే అర్థం. ప్రతి తల్లీ డెలివరీ(Delivery) అవగానే పాలివ్వడానికి తయారుగా ఉంటుంది. ప్రసవ సమయంలోనే గర్భసంచి సంకోచవ్యాకోచాల వల్ల దాని నుంచి ఆక్సిటోసిన్‌(Oxytocin) అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. అప్పుడే మెదడు నుంచి ప్రొలాక్టిన్‌(Prolactin) అనే హార్మోన్‌ ఉత్పత్తి అయి, రొమ్ముల్లోని క్షీర గ్రంథులకు పాలు తయారుచేయమని సంకేతాలను అందిస్తుంది. ఆ సంకేతాలు పాలను ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తాయి. సిజేరియన్‌(Operation) అయినా సరే ఈ హార్మోన్ల ఉత్పత్తి ఉంటుంది. అయితే నార్మల్‌ డెలివరీలో గర్భసంచి సంకోచ వ్యాకోచాలు, నొప్పులు అధికంగా ఉండటం వల్ల కొంచెం ఎక్కువగా విడుదలవుతాయి. అంతేగాక, తల్లి త్వరగా కోలుకుంటుంది కాబట్టి.. పాలివ్వడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు.

(మున‌గాకుతో ఆరోగ్య‌ ప్ర‌యోజ‌నాలెన్నో..!)

అందుకే, నార్మల్‌ డెలివరీలో(Normal Delivery) పాలు ఎక్కువగా వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ బిడ్డ ఎలా పుట్టినా కూడా ఈ హార్మోన్లు(Harmons) పాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. బిడ్డ పాలకోసం నోటితో పీల్చుకునే ప్రయత్నం చేసినప్పుడు ప్రొలాక్టిన్‌ చర్యలవల్ల పాలు రొమ్ము(Breast) నుంచి బయటికి వస్తాయి. బిడ్డ పాలు పీల్చుకోవడానికి ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తే అంత ఎక్కువ పాలు వస్తాయి. ఎంత తొందరగా ప్రయత్నం చేస్తే అంత తొందరగా వస్తాయి. పాలు బాగా రావడంలో బిడ్డకు, తల్లి స్పర్శ అందివ్వడం కీలకమైన(Importance) అంశం. బిడ్డ పుట్టిన వెంటనే రెండు నిమిషాలైనా తల్లి స్పర్శకు దగ్గరగా ఉండాలి. అందుకే నార్మల్‌ డెలివరీ అయినా, సిజేరియన్‌ అయినా బిడ్డ పుట్టగానే రెండు నిమిషాలపాటు తల్లి పొట్టపైన పడుకోబెట్టి, ఆ తర్వాతే బొడ్డుతాడు కట్‌ చేస్తున్నారు. స్పర్శతో మొదలైన ప్రేరణ బిడ్డ పాలు తాగడం మొదలుపెట్టడంతో కొనసాగుతుంది. ఇదంతా ప్రతి తల్లిలోనూ సహజసిద్ధంగా(Natural) జరిగే ప్రక్రియ.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -