రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానంపై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరుగనుంది. ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేయాలని హైకోర్టులో దాఖలైన మూడు పిటిషన్లను ఒక్కటిగా చేసి న్యాయస్థానం విచారించనుంది. పేద, మధ్యతరగతి వారు ఎల్ఆర్ఎస్ వలన ఇబ్బందులు పడుతున్నారని పిటీషనర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఎల్ఆర్‌ఎస్‌పై స్టే విధించాలని గత విచారణలో పిటీషనర్లు కోరగా.. ఇదే అంశంపై నిన్న ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.
పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
రాష్ట్రంలో అక్రమంగా లే అవుట్లు లేకుండా చేయడం కోసం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌ను తీసుకొచ్చిందని కౌంటర్‌లో పేర్కొన్నారు. తెలంగాణను ఇల్లీగల్ ఎల్ఆర్ఎస్ రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు వారు కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వం వన్ టైం మేజర్ కింద అన్ని ఇల్లీగల్ ఎల్ఆర్ఎస్‌ను రెగ్యులరైజ్ చేసి భవిష్యత్‌లో ఎలాంటి అవకతవకలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. నేడు హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై వాదనలు జరుగనున్నాయి.