ఈ ఏడాది చివరి నెలలో బీసీసీఐ సాధారణ వార్షిక సమావేశం(ఏజీఎం) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం.. కరోనా నేపథ్యంలో ఒకే చోట కాకుండా వర్ఛ్యువల్ భేటీ జరగనున్నట్లు సమాచారం. ఐపీఎల్‌లోకి నూతన ప్రాంచైజీలను తీసుకురావడంపై ఈ చర్చ జరగనుంది. కాగా, కొత్త ప్రాంచైజీలను తీసుకురావడం పట్ల ఇప్పుడున్న ప్రాంచైజీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడున్న జట్లలోనే కొందరు నాణ్యమైన ఆటగాళ్లు లేరనీ.. ఆయా టీముల్లో మంచి ఆటగాళ్లను తీసుకుంటే ప్రయోజనముంటుందని ప్రాంచైజీల యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నాయి. కొత్త ప్రాంచైజీలు వస్తే జట్లలో క్వాలిటీ తగ్గుతుందని ఆయా ప్రాంచైజీల వాదన.