రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఉత్తమ పోలీసు అధికారిగా మేడిపల్లి సీఐ అంజిరెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ చేతుల మీదుగా మేడిపల్లి సీఐ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ.. రాచకొండ, సైబారాబాద్, హైదరబాద్ పోలీస్ కమీషనరేట్‌ల పరిధిలోనే మేడిపల్లి పోలీస్ స్టేషన్ఎ స్‌హెచ్‌వో(స్టేషన్ హౌజ్ ఆఫీసర్)గా ఉత్తమ అధికారిగా ఎంపికవడం సంతోషంగా ఉందన్నారు. నిరంతరం ప్రజా రక్షణ కోసం కృషి చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటాననీ.. అదే విధంగా మేడిపల్లి పీఎస్ పరిధిలో అత్యధికంగా నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి, నేరాలను అదుపులో ఉంచగలిగామని తెలిపారు.
తాము చేసిన సేవలు గుర్తించి ఇవాళ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ అవార్డు రావాడంలో తమ పీఎస్ పరిధిలోని అన్ని విభాగాల సిబ్బంది కృషి ఉందని సీఐ అంజిరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.