end
=
Friday, September 20, 2024
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంనాగుల చవితి విశిష్టత తెలుసా..!
- Advertisment -

నాగుల చవితి విశిష్టత తెలుసా..!

- Advertisment -
- Advertisment -

భారతదేశంలోని హిందువులు ప్రతి ఏటా విధిగా నాగుల చవితి ఎంతో నిష్టగా జరుపుకుంటారు. దాని విశిష్టత ఏంటో ఒక్కసారి చూద్దాం. ప్రకృతిని, జంతువులను భక్తి శ్రద్ధలతో పూజించడం భారతీయులకు ఆనాదిగా వస్తున్న ఆచారం. సమస్త జీవకోటిలో ఆ పరమాత్ముడైన ఈశ్వరుడు ఉన్నాడని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇందులో భాగంగానే నాగుపాములను పూజిస్తారు. ముఖ్యంగా దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు భక్తులు నాగుపాములను కొలుస్తారు. దీన్నే నాగుల చవితి అని పిలుస్తారు.

నాగుల చవితి రోజున నాగుపాములను పూజిస్తే.. సకల రోగాలు సమసిపోతాయని భక్తుల నమ్మకం. నూతన దంపతుల వైవాహిక జీవితంలో ఎలాంటి బేదాభిప్రాయాలు, సమస్యలు కలగకూడదని, గర్భదోషాలు సైతం ఇట్టే పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులంతా పుట్టల వద్దకు చేరి పాలు పోస్తారు. కొబ్బరికాయలు కొట్టి.. పండ్లు, ఫలహారాలు సమర్పిస్తారు. నాగన్నను భక్తితో పూజించి, తమ కోరికలను నెరవేర్చమని వేడుకుంటారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -