end
=
Sunday, September 22, 2024
వార్తలురాష్ట్రీయందళితులకు అండగా ఉంటాం: శ్రీరామ్ చక్రవర్తి
- Advertisment -

దళితులకు అండగా ఉంటాం: శ్రీరామ్ చక్రవర్తి

- Advertisment -
- Advertisment -

హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన దళితలకు 40 ఎకరాల భూమి కేటాయించారు. ఈ భూమిని అధికార పార్టీ నేతలకు చెందిన కుటుంబ సభ్యులు కబ్జా చేశారని, దళితులకు కేటాయించిన భూమిపై న్యాయపరమైన విచారణ జరపాలని గత మూడు రోజులుగా అంబెడ్కర్ చౌరస్తాలో దీక్ష చేస్తున్న దళితులకి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులు నాయ్యం వైపు ఉన్నా కూడా స్థానిక ఎమ్మెల్యేకు నచ్చటం లేదు. కోహెడ మండలం రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిందన్నారు. రైతులు న్యాయం కోసం కార్యాలయాల ముందు ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారులు మాత్రం ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు పెట్టారు. అధికారం శాశ్వతం కాదు. ప్రజల చేత ఎన్నుకోబడిన వారు ప్రజల బాగు కోరాలి కానీ అధికార పార్టీకి చెందిన తెరాస నాయకులు భూకబ్జాలకు, ఇసుక దందాలకు, కాంట్రాక్ట్ పనులకు అలవాటు పడి దోచుకుంటున్నారని విరుచుకుపడ్డారు. బాధితులకు అండగా ఉంటామంటే.. కాంగ్రెస్ రాజకీయం చేస్తుందంటారు.

అయినా సరే ఎవరెలా భావించినా న్యాయం జరిగే వరకు జెండాలు, కండువాలు తీసేసి వీళ్ళతోనే రోడ్ల పైనే పడుకుంటా అని అన్నారు. వారితో డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ MD హాసన్, పాతూరి గాల్ రెడ్డి, గాజుల వెంకటేశ్వర్లు, హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు, అక్కు శ్రీనివాస్ , కౌన్సిలర్స్ వళ్లపు రాజు, బుక్యా సరోజన, వెన్నె రాజు, సుధ గోని మధు,బురుగు కృష్ణ స్వామి, చింతకింది శంకర్, ఆవుల మహేందర్, M.D. రఫీ, M.D. అంకుష్, పున్నం సత్యం, వంగర కృష్ణారెడ్డి, ఉప్పుల వెంకన్న, తూటీ సంపత్ రెడ్డి, తూటి చంద్రారెడ్డి, తడిసిన అమరేందర్ రెడ్డి, ఎడబోయిన కనుకయ్య, ఉప్పరపల్లి రాజు,శంకర్, లింగాల కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -