end
=
Friday, November 22, 2024
వార్తలుఅంతర్జాతీయంమోదీతో కలిసి ముందుకెళ్తాం: బైడెన్
- Advertisment -

మోదీతో కలిసి ముందుకెళ్తాం: బైడెన్

- Advertisment -
- Advertisment -

భారత ప్రధాని, అంతర్జాతీయంగా మంచి చరిష్మా ఉన్న నేత నరేంద్రమోదీతో కలిసి పనిచేయడానికి తాము సిద్దంగా ఉన్నట్లు అమెరికా నూతన అధ్యక్షులు జో బైడెన్‌ తెలిపారు. కోవిడ్‌ లాంటి అంతర్జాతీయ సవాళ్లపై మోదీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ బైడెన్‌ చెప్పారు. ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి భద్రతల నిర్వహణ, ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను రికవరీ బాట పట్టించడం లాంటి అంశాలపై మోదీతో కలిసి పనిచేయాలని చూస్తున్నట్లు బైడెన్‌ తెలిపారు. తనకు అభినందనలు తెలిపినందుకు మోదీకి బైడెన్‌ కృతజ్ఞతలు చెప్పారు.

భారత సంతతి నేత కమలా హ్యారిస్‌తో కలిసి ఇండో-అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కమలా హ్యారిస్‌.. అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. అగ్ర రాజ్యాధినేతగా ఎన్నికైన బైడెన్‌కు మోదీ మంగళవారం అభినందనలు చెప్పారు. కమలా హ్యారిస్‌ను సైతం మోదీ అభినందించారు. ఒబామా హయంలో బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో జరిపిన సమావేశాలను మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 1970 నుంచి సెనేటర్‌గా బైడెన్‌ భారత్‌కు బలమైన మద్దతునిస్తున్నారు. 2008లో ద్వైపాక్షిక అణుఒప్పంద ఆమోదం కోసం బైడెన్‌ గట్టిగా కృషి చేశారు. ఒబామా హయాంలో ఇండో- అమెరికా బంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు బైడెన్‌ ఎంతో చొరవ తీసుకున్నారని మోదీ గుర్తు చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -