end
=
Saturday, September 21, 2024
వార్తలుజాతీయంమంత్రి పదవి చేపట్టిన గంటల్లోనే రాజీనామా..
- Advertisment -

మంత్రి పదవి చేపట్టిన గంటల్లోనే రాజీనామా..

- Advertisment -
- Advertisment -

పాట్నా : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి తమ స్థానాన్ని పదిలం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, బిహార్‌ మంత్రివర్గంలోని ఓ మంత్రి అనూహ్య రీతిలో రాజీనామా చేశారు. వివరాలు చూస్తే.. సీఎంగా నితీష్‌ ప్రమాణ ప్రస్థానం ఓ మంత్రి రాజీనామాతో ప్రారంభమైందని చెప్పవచ్చు. నితీశ్‌ కేబినెట్ లో విద్యా మంత్రిగా ఉన్న మేవాలాల్ చౌధురి(జేడీయూ) తన మంత్రి పదవికి గురువారం రాజీనామా చేశారు. మేవాలాల్ చౌధురి గురువారమే బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటల్లోనే రాజీనామా చేయడం కొసమెరుపు. అవినీతి ఆరోపణలతో పాటు ఆయన భార్య అనుమానాస్పదంగా మరణించిన కేసులో మేవాలాల్ హస్తముందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వీటిని ఆధారంగా చేసుకొనే ప్రతిపక్ష ఆర్జేడీ మేవాలాల్ పై రెండు రోజులుగా తీవ్రమైన ఆరోపణలు చేయడంతో పాటు ఆయన పాత్రపై విచారణ చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తోంది.

మేవాలాల్ రాజీనామాపై ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్ ట్వీట్ చేస్తూ.. గౌరవ ముఖ్యమంత్రి గారూ.. అవినీతి విధానాలపై, తప్పుడు విధానాలపై, తప్పుడు నియామకాలకు వ్యతిరేకంగా పోరాడాలని, ఈ విషయంలో సీఎంను హెచ్చరిస్తూనే ఉండాలని ప్రజలు తమ తీర్పులో పేర్కొన్నారు. కేవలం రాజీనామా చేస్తే సరిపోదు. 19 లక్షల ఉద్యోగాలిస్తామన్న హామీ కూడా మీరు చేశారు. ఇలా చాలా హామీలే ఇచ్చారు అంటూ తేజస్వీ చురకలంటించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -