end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంమన దగ్గర సెకండ్ వేవ్‌ ఉండకపోవచ్చు
- Advertisment -

మన దగ్గర సెకండ్ వేవ్‌ ఉండకపోవచ్చు

- Advertisment -
- Advertisment -

ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలవడంతో ఆయా దేశాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాగా, కరోనా సెకెండ్‌ వేవ్‌ ప్రభావం మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉండకపోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కట్టడికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తి సన్నద్ధతతో ఉందని, ప్రతి రోజు 50 వేల మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.

శుక్రవారం హైటెక్స్‌లో జరిగిన ‘‘ప్రివెంటివ్‌ హెల్త్‌కేర్‌ అండ్‌ ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌- 2020’ పేరిట ‘ రీ ఓపెనింగ్‌ ఆఫ్‌ స్కూల్స్‌ కాన్సె్ప్ట్‌’పై జరిగిన సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. పాఠశాలలను ప్రారంభించడానికి ప్రైవేటు యాజమాన్యాలన్నీ సంసిద్ధంగా ఉన్నాయని, అందుకు సర్కారు సహకారం కావాలని ట్రస్మా ప్రతినిధులు మంత్రిని కోరారు. పిల్లల విద్యపై విశాల దృక్పథంతో ఆలోచించి, అంతా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలని వారికి మంత్రి సూచించారు. బడులను తిరిగి ప్రారంభించే విషయంలో త్వరలోనే సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారన్నారు. అవసరమైతే స్కూల్స్‌లోనూ పరీక్షలు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -