end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంబీజేపీ తీర్థం పుచ్చుకోనున్న స్వామిగౌడ్
- Advertisment -

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న స్వామిగౌడ్

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ బీజేపీలో చేరనున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కషాయ కండువా కప్పుకోనున్నారు. సాయంత్రం తెలంగాణ బీజేపీ నేతల సమక్షంలో పార్టీలో చేరనున్నుట్లు సమాచారం. కొంతకాలంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి దూరంగా ఉంటున్న స్వామిగౌడ్‌.. తాజాగా బీజేపీకి జై కొట్టారు. ఇదిలా ఉంటే స్వామిగౌడ్‌తో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్‌ సమావేశమైన విషయం తెలిసిందే. బీజేపీలోకి రావాలని ఆయనకు ఆహ్వానమందినట్లు అప్పుడు ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారంపై స్వామి గౌడ్ స్పందించలేదు.

ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న అగ్ర నేతలతో బీజేపీ అధిష్ఠానం చర్చలు జరిపింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి, సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. వీరేగాక పలువురు యువనేతలు ఆ బాటలో నడుస్తున్నారని సమాచారం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -