end
=
Wednesday, October 30, 2024
వార్తలురాష్ట్రీయంబీజేపీ గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టో..
- Advertisment -

బీజేపీ గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టో..

- Advertisment -
- Advertisment -
  • విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌

హైదరాబాద్: బీజేపీ గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆ పార్టీ నేతలు లక్ష్మణ్‌, డీకే అరుణ, వివేక్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావానికి సుదీర్ఘ పోరాటం జరిగిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించామన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర చాలా ఉందన్నారు. ప్రజలకు ఏం కావాలో మేం అర్థం చేసుకున్నామన్నారు. రాజ్యాంగాన్ని మోదీ సర్కార్‌ కాపాడుతోందన్నారు. గ్రేటర్‌లో గెలిపిస్తే సెప్టెంబర్‌ 17ని అధికారికంగా నిర్వహిస్తామని ఫడ్నవిస్‌ వెల్లడించారు.

బీజేపీ మేనిఫెస్టో ఇదే..

  • వరదల్లో నష్టపోయిన వారికి 25 వేలు సాయం
  • కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తాం
  • గ్రేటర్‌లో గెలిపిస్తే సెప్టెంబర్‌ 17ని అధికారికంగా నిర్వహిస్తాం
  • ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తాం
  • హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తాం..
  • అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాం
  • పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో మహిళలకు ఉచిత ప్రయాణం
  • ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ కోసం హై క్వాలిటీ వైఫై
  • లక్ష మంది పేదలకు ప్రధాని ఆవాజ్‌ యోజన కింద ఇళ్లు
  • 10 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన
  • వచ్చే వర్షాకాలం నాటికి హైదరాబాద్ నాలాల పునరుద్ధరణ
  • ఎస్సీ కాలనీలు, బస్తీ వాసులకు ఆస్తిపన్ను రద్దు
  • 125 గజాలలోపు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదు
  • ప్రజలందరికీ ఉచిత మంచి నీరు అందిస్తాం
  • పేదలకు 100 యానిట్ల వరకు ఉచితంగా విద్యుత్ పంపిణీ
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -