end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంశాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
- Advertisment -

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: నగరంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో ఎలాంటి రూమర్లు వచ్చినా నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. సోషల్‌ మీడియా పోస్టులపై నిఘా ఉంచినట్లు ఆయన తెలిపారు. గత ఆరేళ్లలో నగరంలో ఎలాంటి అల్లర్లు జరగలేదని తెలిపిన ఆయన.. ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరాడు. హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర జరుగుతోందని తమకు సమాచారం ఉందని ఆయన తెలిపారు.

కాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆయా ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. నగరంలో అల్లర్లు సృష్టించేందుకు మీ పార్టీ అంటే మీ పార్టీ వ్యూహాలు పన్నుతోందని, ఇది నగరానికి తీవ్ర పరిణామమవుతుందని ఎవరికి వారు నిందలు వేసుకుంటున్నారు. ఎంఐఎం, భాజాపా, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌.. ఇలా అన్ని పార్టీలు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రచారం చేస్తున్నాయి. అలాగే సోషల్‌ మీడియాలోనూ ఇలాంటి ప్రచారాలు సాగడంతో డీజీపీ హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -