టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వెర్సటైల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. వీరు ఇంతకు ముందే ఆర్య, ఆర్య2 సినిమాలు చేశారు. ఈ రెండు మూవీలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది ముచ్చటగా మూడో సినిమా. కాగా, ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తమిళ్ టాప్ హీరో, చియాన్ విక్రమ్ ఈ సినిమాలో భాగం అవబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో విక్రమ్.. విలనిజం పాత్ర వేయనున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే మెగా అభిమానులకిక సంబరమే.