end
=
Saturday, September 21, 2024
సినీమారియల్‌ సైనికుడిగా రానా..
- Advertisment -

రియల్‌ సైనికుడిగా రానా..

- Advertisment -
- Advertisment -

టాలీవుడ్‌ ఇండస్ట్రీతో సినీ ఆరంగ్రేటం చేసిన యంగ్‌ హీరో దగ్గుబాటి రానా. తెలుగులో పలు సినిమాలు చేసిన రానా.. బాహుబలితో పాన్ ఇండియా యాక్టర్‌గా మారాడు. బాహుబలి కంటే ముందే రానా పలు హిందీ సినిమాలు చేశాడు. కానీ రాజమౌళి బాహుబలితోనే ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకున్నాడు. అనంతరం, రానా అన్ని ఇండస్ట్రీల్లో బిజీ అయ్యారు. కాగా, రానా రియల్‌ లైఫ్‌ అడ్వెచర్‌ చేశాడు. ఒకరోజంతా బార్డర్‌లో సైనికుడిగా విధులు నిర్వర్తించాడు. డిస్కవరీప్లస్‌ ఇండియా కార్యక్రమం మిషన్‌ ‘ఫ్రంట్‌లైన్‌’ కోసం నిజంగానే బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ అవతారమెత్తాడు. జైసల్మేర్ సరిహద్దుల్లో ఒక రోజంతా గడిపిన రానా.. ఇదో లైఫ్‌ టైమ్‌ ఎక్స్‌ఫీరియన్స్‌ అని ట్వీట్ చేశాడు.

ఈ సందర్భంగా రానా తన అనుభవాలను పంచుకుంటూ.. తనపై యుద్ద కథలు-అనుభవాలు బలమైన స్ఫూర్తి కలిగించాయని, బలమైన ముద్ర వేశాయని తెలిపాడు. తనకు ఇంతమంచి అవకాశమిచ్చిన డిస్కవరీ ఇండియాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -