న్యూజీలాండ్ స్టార్ క్రికెటర్ కోరె అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. తన ఆరంగేట్ర మ్యాచ్‌లోనే విండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అండర్సన్ కేవలం 36 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. భారీ హిట్టర్‌గా అండర్సన్‌కు పేరుంది. అతను అలవోకగా సిక్సర్లు బాదగలడు. అండర్సన్ న్యూజీలాండ్‌కు మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించాడు. అతను ఐపీఎల్‌లోనూ ఆడాడు. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అండర్సన్ ప్రాతినిథ్యం వహించాడు.
అమెరికా మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్‌సీ) టీ 20తో మూడేళ్ల పాటు ఒప్పందం చేసుకున్నందుకు గానూ అతను న్యూజిలాండ్ జట్టుకు గుడ్‌బై చెప్పాడు. తన ప్రియురాలి కోరిక మేరకు న్యూజిలాండ్ నుంచి అమెరికాకు మకాం మార్చనున్నాడు కోరే. ఈ సందర్భంగా అండర్సన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. న్యూజీలాండ్‌కు ఆడడం తన అదృష్టమన్నాడు. నన్నింతకాలం ఆదరించిన అభిమానులకు, సహచరులకు, టీం మేనేజ్‌మెంట్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపాడు.