తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్‌లో టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత, భారత తొలి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ 64వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా
తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ.. డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ దేశానికి ఎనలేని సేవలు చేశారన్నారు. బడుగు బలహీన వర్గాలు, బీసీ, మైనార్టీలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత అంబేడ్కర్ గారికే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ సందర్భంగా వారు డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి భీమరి సాయి సమ్మర్, అజర్ అలీ, మాజాజ్, సోహెల్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisment -
ఘనంగా అంబేడ్కర్ వర్థంతి వేడుకలు
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -