end
=
Friday, September 20, 2024
క్రీడలురెండో టీ20లో భారత్‌ విజయం
- Advertisment -

రెండో టీ20లో భారత్‌ విజయం

- Advertisment -
- Advertisment -
  • 2-0తో సిరీస్ భారత్‌ వశం
    – రాణించిన పాండ్యా, ధావన్, కోహ్లి
    – మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్ పాండ్యా

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్ విజయబావుటా ఎగురవేసింది. 6 వికెట్ల తేడాతో భారత్‌ విజయ ఢంకా మోగించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2-0 సొంతం చేసుకుంది. ఆసీస్‌ నిర్ధేశించిన 195 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి, ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్‌(30)ను టై ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి(24 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధావన్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 95 పరుగుల వద్ద ధావన్‌(36 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. చివర్లో ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా(22 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆల్‌రౌండ్‌ షోతో ఇన్నింగ్స్‌ను ముగించాడు. అతడికి అయ్యర్‌ అండగా నిలిచాడు. దీంతో భారత్‌ వన్డేల్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకున్నట్లయింది. ఆసీస్‌ బౌలర్లలో డ్యానియెల్ సామ్స్‌, టై, స్వెప్సన్‌, ఆడమ్‌ జంపా తలా ఓ వికెట్ తీశారు.

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు సాధించింది. ఓపెనర్ కెప్టెన్‌ మాథ్యూ వేడ్(32 బంతుల్లో58 పరుగులు; 10 ఫోర్లు, 1 సిక్సర్‌), స్టీవెన్‌ స్మిత్(38 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. మ్యాక్స్‌వెల్(22), హెన్రిక్స్‌(26) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో నటరాజన్‌ 2, శార్దూల్ ఠాకూర్‌, చాహల్‌ తలా ఓ వికెట్ చేశారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన భారత ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌పాండ్యాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -