- టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా
మ్యాచ్‌లు త్వరగా ఫినిష్ చేయడంలో, భారీ హిట్టింగ్ చేయడానికి తనకు స్ఫూర్తి విండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ అని అంటున్నాడు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. ఆసీస్‌తో జరిగిన రెండో టీ ట్వంటీ విజయానంతరం మీడియాతో మాట్లాడిన హార్థిక్.. తనకు దూకుడు నేర్పింది పొలార్డ్ అన్నాడు. మ్యాచ్‌ను చివరిదాకా తేకుండా త్వరగానే ముగించాలని పొలార్డ్ తనతో చెప్పినట్లు ఆయన అన్నాడు. వీరిద్దరు కూడా ఐపీఎల్‌లో తొలి నుంచి ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
కాగా, ఈ మ్యాచ్‌లో తనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కడంపై హార్థిక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను చివర్లో హిట్టంగ్ చేసిన మాట వాస్తవమే. కానీ, ఆసీస్ బ్యాట్స్‌మెన్ భారీ పరుగులు సాధించకుండా నిలువరించింది యువ బౌలర్ నటరాజన్ అని హార్ధిక్ అన్నాడు. వాస్తవానికి ఈ అవార్డుకు తనే అర్హుడన్నాడు. కాగా, ఆసీస్ తో జరిగిన రెండు టీ ట్వంటీల్లోనూ భారత్ విజయం సాధించి 2-0తో లీడ్‌లో ఉన్న విషయం తెలిసిందే.