పెళ్లిపై సింగర్ సునీత రియాక్షన్
అడిలైడ్: ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాభవం పొందిన టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే జడేజా తొలి టెస్టుకు దూరమవగా.. తదుపరి మూడు టెస్టులకు కీలక ఆటగాడు, కెప్టెన్ కోహ్లి వెటర్నరీ సెలవుపై ఇండియాకు బయల్దేరాడు.
రేపట్నుంచి ఇంటర్ క్లాసులు ప్రారంభం
ఇదిలా ఉంటే జట్టు ప్రధాన పేసర్ మొహమ్మద్ షమీకి రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్ వేసిన బంతిని ఆడే క్రమంలో చేతికి గాయమైంది. అతను బ్యాటింగ్ చేయలేక వెంటనే క్రీజు నుంచి నిష్క్రమించాడు. మణికట్టు గాయంతో సిరీస్‌లోని మిగిలిన మూడు టెస్టులకు దూరమయ్యాడు. మ్యాచ్ తర్వాతి జరిపిన స్కానింగ్‌లో షమీ మణికట్టుకు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అతని స్థానంలో తదుపరి మ్యాచ్‌ల్లో నవదీప్ సైనీ లేదా హైదరాబాద్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు.