end
=
Wednesday, September 18, 2024
క్రీడలువిరాట్ లేకుంటే భారత్‌కు కష్టమే: స్మిత్
- Advertisment -

విరాట్ లేకుంటే భారత్‌కు కష్టమే: స్మిత్

- Advertisment -
- Advertisment -

మెల్‌బోర్న్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో లేకపోవడం భారత్‌కు పెద్ద లోటేనని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా అడిలైడ్ టెస్టులో భారత్ దారుణ ఓటమి చవిచూసింది. కోహ్లి సతీమణి అనుష్క తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్న సందర్భంగా పితృత్వ సెలవు తీసుకున్న కోహ్లీ నేడు భారత్‌కు బయలుదేరాడు. దీంతో మిగతా మూడు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో కోహ్లీ లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటేనన్న స్మిత్.. ఇంటికి వెళ్లాలన్న అతడి నిర్ణయాన్ని ప్రశంసించాడు. ఇక్కడే ఉండాలన్న ఒత్తిడి అతడిపై ఉండొచ్చని అయితే, తొలి బిడ్డ కోసం అతడు ఇంటికి వెళ్లాలన్న నిర్ణయం మాత్రం ప్రశంసనీయమని పేర్కొన్నాడు. ఇదో మైలురాయి అని, దానిని అతడు కోల్పోవాలని అనుకోడని స్మిత్ పేర్కొన్నాడు.

కాగా, తొలి టెస్టులో స్మిత్ దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి, రెండో ఇన్నింగ్స్‌లో మరో పరుగు చేశాడు. మెల్‌లోబోర్న్‌లో జరగనున్న బాక్సింగ్ డే టెస్టులో సత్తా చాటాలని కసిగా ఉన్నాడు. బాక్సింగ్ డే టెస్టుల్లో ఏడుసార్లు ఇదే పిచ్‌పై అద్భుత ప్రదర్శన కనబరిచిన స్మిత్.. భారత్‌తో జరగనున్న రెండో టెస్టులోనూ అదే ప్రదర్శన కనబరచాలని పట్టుదలగా ఉన్నాడు. 113.50 సగటుతో ఇక్కడ 908 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. మూడుసార్లు 50కిపైగా పరుగులు చేశాడు. సిడ్నీలో అతడి సగటు 67.88. అన్ని వేదికలతో పోలిస్తే బాక్సింగ్ డే రికార్డే అత్యుత్తమమని తాను భావిస్తున్నట్టు స్మిత్ వివరించాడు. ఎంసీజీ గ్రౌండ్‌లో బ్యాటింగ్ చేయడానికి తాను ఇష్టపడతానని పేర్కొన్నాడు. తాను పిల్లాడిగా ఉన్నప్పటి నుంచే బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ ఆడాలని కలలు కనేవాడినని స్మిత్ పేర్కొన్నాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -