end
=
Sunday, November 24, 2024
క్రీడలుటాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌
- Advertisment -

టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌

- Advertisment -
- Advertisment -

మెల్‌బోర్న్‌: టీమిండియాతో ఎంసీజీలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి టెస్టు విజయంతో ఆసీస్‌ హుషారుగా ఉంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ కోహ్లి సేవలు కోల్పోనుంది టీమిండియా. ఆయన పితృత్వ సెలవుపై ఇండియాకు వచ్చాడు. అతని స్థానంలో అజింక్యా రహానే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా జట్లు పలు మార్పులతో బరిలోకి దిగనుంది. ఓపెనర్‌ పృథ్వీ షా స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌ జట్టులోకి వచ్చాడు. వికెట్ కీపర్‌ సాహా స్థానంలో పంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. గాయపడిన పేసర్‌ షమీ స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌, ఆల్‌రౌండర్‌ జడేజా జట్టుతో జాయినయ్యారు.

జట్లుః
ఇండియా: మయాంక్ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, ఛటేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే(కెప్టెన్‌), హనుమ విహారి, రిషబ్‌పంత్‌(వికెట్ కీపర్‌), రవీంద్ర జడేజా, అశ్విన్‌, ఉమేష్‌ యాదవ్‌, బుమ్రా, సిరాజ్‌.
ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్‌, జో బర్న్స్‌, లబుషేన్‌, స్టీవెన్ స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, కామెరూన్‌ గ్రీన్‌, టిమ్‌ పైన్‌(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), ప్యాట్‌ కమ్మిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్ లియాన్, హెజెల్‌వుడ్‌.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -