end
=
Saturday, November 23, 2024
క్రీడలుభారత క్రికెటర్లపై జాత్యహంకార వ్యాఖ్యలు
- Advertisment -

భారత క్రికెటర్లపై జాత్యహంకార వ్యాఖ్యలు

- Advertisment -
- Advertisment -

సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ సందర్భంగా‌ ప్రేక్షకులు రెచ్చిపోయారు. టీమిండియా ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. రెండో రోజు ఆటలోనూ వారికి ఇలాంటి అనుభమే ఎదురైంది. ఫీల్డింగ్‌ చేస్తున్న సిరాజ్, బుమ్రాలను ఉద్దేశించి వారు అభ్యంతరకర పదజాలంతో దూషించారు. కెప్టెన్ అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్‌ అంపైర్లు పాల్ రీఫెల్, పాల్ విల్సన్‌ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అలాగే, టీమిండియా మేనేజ్‌మెంట్ ఈ ఘటనపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

భారత ఆటగాళ్లపై చేసిన జాత్యహంకార వ్యాఖ్యలను ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. భారత జట్టు మేనేజ్‌మెంట్ ఫిర్యాదుపై దర్యాప్తునకు రెడీ అయింది. సిడ్నీ క్రికెట్ మైదానం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ‘వెన్యూస్ న్యూసౌత్ వేల్స్’తో కలిసి సీసీ టీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తోంది. పౌర సమాజంలో ఇలాంటి వర్ణ వివక్ష గర్హనీయమని.. ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియాలు స్పందించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ పేర్కొంది. ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -