end
=
Wednesday, November 20, 2024
క్రీడలుముగిసిన రెండో రోజు ఆట.. ఇండియా 62/2
- Advertisment -

ముగిసిన రెండో రోజు ఆట.. ఇండియా 62/2

- Advertisment -
- Advertisment -

బ్రిస్బేన్‌: ఆతిథ్య ఆస్ట్రేలియాతో కీలకమైన నాలుగో టెస్టులో తలపడుతున్న టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 26 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(44) మరో 7 ఓవర్లలో ఆట ముగుస్తుందనగా 60 పరుగుల వద్ద లియాన్‌ బౌలింగ్‌లో రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. జట్టు 11 పరుగుల వద్ద ఉండగా మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(7)ను కమ్మిన్స్‌ పెవిలియన్‌కు పంపాడు. ఇంకా మూడు రోజుల ఆట మిగిలుండగా.. ఇండియా 307 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం పుజారా(8), కెప్టెన్‌ అజింక్యా రహానే(2) క్రీజులో ఉన్నారు. వీరిరువురూ రెండో రోజు కీలక ఇన్నింగ్స్‌ ఆడితేనే జట్టు గాడిన పడుతుంది.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌.. 115.2 ఓవర్లలో 369 పరుగులకు ఆలౌట్ అయింది. లబుషేన్‌(204 బంతుల్లో 108; 9 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకోగా.. కెప్టెన్‌ టిమ్‌ పైన్‌(50) అర్ధసెంచరీతో మెరిశాడు. మాథ్యూవేడ్‌(45), గ్రీన్‌(47), స్మిత్‌(36) రాణించారు. ముఖ్యంగా మార్నస్‌ లబుషేన్‌ తనకు అందివచ్చిన లైఫ్‌ను పూర్తిగా సద్వినియోగపర్చుకున్నాడు. కీలకమైన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతడు తృటిలో సెంచరీ కోల్పోయిన విషయం తెలిసిందే. ఇండియా బౌలర్లలో ఆరంగేట్ర ఆటగాడు నటరాజన్‌ 3 వికెట్లతో చెలరేగాడు. శార్ధూల్‌ ఠాకూర్, సుందర్‌ కూడా మూడేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్‌ ఓ వికెట్‌ తీశాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -