end
=
Sunday, November 24, 2024
క్రీడలుటీ విరామానికి భారత్‌ 253/6
- Advertisment -

టీ విరామానికి భారత్‌ 253/6

- Advertisment -
- Advertisment -

బ్రిస్బేన్‌: గబ్బా వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌ ఎదురీదుతోంది. టీ విరామ సమయానికి 88 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 62/2తో మూడో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌.. 105 పరుగుల వద్ద నయా వాల్‌ పుజారా(25) హెజెల్‌వుడ్‌ బౌలింగ్‌లో కీపర్‌ పైన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మరో 40 పరుగుల వ్యవధిలో కెప్టెన్‌ అజింక్యా రహానే(37) స్టార్క్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఫుల్‌ ఫాంలో ఉన్న రిషభ్‌ పంత్‌(23) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరాడు. హెజెల్‌వుడ్‌ బౌలింగ్‌లో గ్రీన్‌ చక్కటి క్యాచ్‌ అందుకున్నాడు.

ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్‌ సుందర్‌ (90 బంతుల్లో 39; 5 ఫోర్లు), శార్దూల్‌ ఠాకూర్‌(41; 72 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్‌) ఉన్నారు. మరో నాలుగు వికెట్లు చేతిలో ఉండగా వీరిద్దరి భాగస్వామ్యం జట్టుకు చాలా అవసరం. మరో వికెట్‌ పడకుండా రోజును ముగిస్తే భారత్‌ పూర్తిగా కోలుకున్నట్లే. ఆసీస్‌ బౌలర్లలో హెజెల్‌వుడ్‌ 3 వికెట్లు తీశాడు. స్టార్క్‌, కమ్మిన్స్‌ , లియాన్‌ తలా ఓ వికెట్ పడగొట్టారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -