end
=
Thursday, November 21, 2024
క్రీడలుముద్దుతో నాన్న గాయం హాంఫట్‌..
- Advertisment -

ముద్దుతో నాన్న గాయం హాంఫట్‌..

- Advertisment -
- Advertisment -

తన తండ్రి ప్రత్యర్థి బౌలర్ల బీభత్సమైన బౌన్సర్లలను ఎదుర్కొని, క్రీజులో అడ్డుగోడలా నిలబడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడని.. ఈ క్రమంలో నాన్నకు చాలా గాయాలయ్యాయంది భారత నయా వాల్‌ పుజారా కుమార్తె అదితి. తన గాయాలకు నా వద్ద మంచి మందు ఉంది అంటుంది అదితి. దీంతో నాన్న గాయాలు ఇట్టే నయమవుతాయంటుంది ఈ బుజ్జి పాపాయి. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గాయపడిన పుజారాకు అతడి రెండేళ్ల కుమార్తె అదితి చక్కని రెమెడీ చెప్పింది. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు గాయమైన చోట ముద్దిస్తానని, ఆ ముద్దుతో గాయం మాయమైపోతుందని ముద్దుముద్దుమాటలతో చెప్పుకొచ్చింది. టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే స్వదేశానికి బయలుదేరారు. దీంతో తండ్రి కోసం అదితి చక్కని మందుతో ఎదురుచూస్తోంది.

కుమార్తె మాటలతో పొంగిపోయిన పుజారా బ్రిస్బేన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఓ తండ్రిగా తానేం చేస్తానో, ఆమె కూడా తనకు అదే చేయాలని అనుకుంటోందని అన్నాడు. అదితి పొరపాటున కిందపడినప్పుడు తాను గాయమైన చోట ముద్దు పెడతానని, దీంతో ముద్దిస్తే ఏ గాయమైనా తగ్గిపోతుందని తను నమ్ముతోందని సంతోషం నిండిన కళ్లతో చెప్పాడు ఛటేశ్వర్‌.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -