ప్రపంచంలో ఎక్కువ ఆదరణ ఉన్న క్రీడల్లో ఫుట్‌బాల్, క్రికెట్ ముందు వరుసలో ఉంటాయి.ఈ రెండు ఆటలను ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ఫాలో అవుతారు ఫ్యాన్స్. ఇటీవల కాలంలో ఫుట్‌బాల్‌కు చెందిన ఫిఫా(ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్), క్రికెట్‌కు చెందిన ఐసీసీ(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) మధ్య సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విషయంలో విపరీతమైన పోటీ నడుస్తోంది. రెండు సంస్థలు తమ తమ అభిమానులను ఆకట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా, ప్రస్తుతం ఐసీసీ అత్యధిక ఫాలోవర్లతో ఫిఫాను దాటి టాప్‌లో ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.