ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొత్తు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఈ పరిస్థితికి వారే కారణమని విజయసాయి ఆరోపించారు. స్థానిక సంస్థల స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ప్రకటించారు. తాము ఎన్నికలకు భయపడటం లేదని, కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా వ్యతిరేకించామని చెప్పారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడితే ఎస్‌ఈసీ నిమ్మగడ్డనే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం చంద్రబాబు కోసం ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.
గత సంవత్సరం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినప్పటి నుంచి నిమ్మగడ్డపై అధికారపార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. అనేక పరిణామాల జరిగిన తర్వాత రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. అయితే మంత్రులు, వైసీపీ నేతలు మాత్రం సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని చెబుతూనే.. నిమ్మగడ్డపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. క్షేత్ర స్థాయి నేతలు ఎన్నికల కోసం సన్నద్ధంగా ఉన్నారని ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఏకగ్రీవాలు ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ఆయన భారీ నజరానాలు కూడా ప్రకటించారు. ఏకగ్రీవాలు బలవంతంగా అవుతున్నాయా? లేదా ప్రజల సమ్మతితోనే జరుగుతున్నాయా అనే విషయంపై పర్యవేక్షిస్తారని నిమ్మగడ్డ చెప్పారు.